Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫేస్‌వైప్స్‌ పలు విధాలుగా!

ఆంధ్రజ్యోతి(29-08-2020)

ముఖం మీది జిడ్డును, పొడిదనాన్ని తొలగించేందుకు ఫేస్‌వైప్స్‌ వాడుతాం. సీజన్‌తో సంబంధం లేకుండా వీటిని చర్మసంరక్షణలో ఉపయోగిస్తుంటాం. ఫేస్‌వైప్స్‌ హ్యాండ్‌బ్యాగులో ఉంటే బయటకు వెళ్లినప్పుడు ముఖాన్ని తేమగా, తాజాగా ఉంచుకోవచ్చు. అంతేకాదు వీటి ఇతర ఉపయోగాలివి...


 ఫేస్‌వైప్స్‌ పర్‌ఫ్యూమ్‌గానూ, డియోడరంట్‌గానూ పనికొస్తాయి. అదెలాగంటే... ఒక్కోసారి పర్‌ఫ్యూమ్‌ వాడడం మర్చిపోతుంటాం. దాంతో బయటకు వెళ్లినప్పుడు చెమట వాసన వస్తుంది. అప్పుడు ఫేస్‌వైప్స్‌తో చెమట పట్టిన చోట తుడుచుకుంటే చెడు వాసన వదులుతుంది. మేకప్‌ తొలగించేందుకు కూడా ఫేస్‌వైప్స్‌ ఉపయోగించవచ్చు. మేకప్‌ రిమూవర్స్‌తో కళ్ల దగ్గరి మేకప్‌ తొలగించేందుకు ఎక్కువ సమయం, శ్రమ అవసరమవుతుంది. అలాంటప్పుడు ఫేస్‌వైప్స్‌ తీసుకొని రుద్దితే మేకప్‌ తొందరగా వచ్చేస్తుంది. సున్నితమైన చర్మం గలవారు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినప్పుడు పట్టిన చెమటను ఫేస్‌వైప్స్‌తో  తుడుచుకోవాలి. దాంతో స్వేద గ్రంథులు తిరిగి తెరచుకుంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.Advertisement

అందమే ఆనందంమరిన్ని...

Advertisement