రన్నింగ్ లో ‘మాస్క్’ వాడుతున్నారా... ఇది చదవండి...

ABN , First Publish Date - 2020-08-02T22:54:56+05:30 IST

ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తోన్న ఓ ఎగ్జిక్యూటివ్... మాస్కు ధరించి రన్నింగ్ చేస్తూ… తీవ్రమైన గుండెపోటుతో మరణించిన ఘటన కొద్ది రోజుల క్రితం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే... రన్నింగ్, మార్నింగ్ వాక్ సమయాల్లో మాస్క్వువాడితే... ఏవైనా సమస్యలుంటాయా ? అన్న విషయమై చర్చ నడుస్తోంది.

రన్నింగ్ లో ‘మాస్క్’ వాడుతున్నారా... ఇది చదవండి...

న్యూఢిల్లీ : ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తోన్న ఓ ఎగ్జిక్యూటివ్... మాస్కు ధరించి రన్నింగ్ చేస్తూ… తీవ్రమైన గుండెపోటుతో మరణించిన ఘటన కొద్ది రోజుల క్రితం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే... రన్నింగ్, మార్నింగ్ వాక్ సమయాల్లో మాస్క్వువాడితే... ఏవైనా సమస్యలుంటాయా ? అన్న విషయమై చర్చ నడుస్తోంది. 


ఉదయం సాయంత్రం వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసేవారంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్లులను ధరించి వ్యాయామాలు చేశారంటే తీవ్ర పరిణామాలుంటాయనే ప్రచారం వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతోంది. లాక్‌డౌన్ మొదలైన రోజులనుండే ఈ చర్చ నడుస్తోంది. కాగా... ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ రన్నింగ్ జాగింగ్ చేసేవారు మాస్కు‌లను ధరించేపక్షంలో... పరుగు వేగాన్ని కాస్త తగ్గించుకోవాలని… చెన్నైకి చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ చెబుతున్నారు.


గురుగ్రావ్‌కు చెందిన జనరల్ ఫీజిషియన్ డాక్టర్ జోయేత బసు ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందిస్తూ…‘మాస్కు లేకుండా రన్నింగ్ చేయటం వల్లనే ఆ ఎగ్జిక్యూటివ్ మరణించారంటూ వాట్సప్ లో చాలామంది స్పందిస్తున్నారు. కాగా... మాస్క్ ధరించడం వలన ఆక్సిజన్ అందని పరిస్థితి ‘హైపోక్సియా’ సంభవించదు. ఆయన సడన్ కార్డియాక్ డెత్ కి గురై ఉండవచ్చు. మాస్క్ధురించి కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


అయితే... ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ ని ధరిస్తే... సౌకర్యంగా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉండవచ్చని హెచ్చరించింది. వ్యాయామంలో మాస్కు ధరిస్తే  త్వరగా చెమట పట్టేసి, బ్యాక్టీరియా పెరగవచ్చని పేర్కొంది.


వ్యాయామం చేసేవారందరూ తప్పనిసరిగా ఇతరులనుండి ఆరు అడుగుల దూరం పాటించి తీరాలని కూడా సలహా ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ విషయంపై... ‘వ్యాయామం చేసే సమయంలో మాస్కులు  ధరించవద్దు’ అంటూ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-08-02T22:54:56+05:30 IST