Abn logo
Sep 21 2021 @ 01:17AM

‘పడాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి’

తుర్కపల్లి నుంచి భారీ ర్యాలీతో హైదరాబాద్‌కు బయలుదేరిన టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు

తుర్కపల్లి, సెప్టెంబరు 20: ఆలేరు మాజీ మార్కెట్‌ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌పై  టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి పలువురు నాయకులు కోరారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నేతలు భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు వెళ్లారు. మినిస్టర్స్‌ క్వాటర్స్‌లో మంత్రి జగదీష్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న వివాదాన్ని మంత్రికి పడాల శ్రీనివాస్‌  వివరిం చారు. ఈ సమస్యను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడానికి మంత్రి హామీ ఇచ్చినట్లు స్థానిక నేతలు తెలిపారు. ముందుగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. హైదరాబాద్‌బాద్‌కు  వెళ్లిన వారిలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ దానావతు బీకునాయక్‌, రైతు బంధు మండల కన్వీనర్‌ కొమిరిశెట్టి నర్సింహులు, దత్తాయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్‌, మహిళా సంఘం మండల అధ్యక్ష, కార్య దర్శులు, టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్‌, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పం చ్‌లు, పీఏసీఏస్‌ డైరక్టర్లు,  పలు గ్రామ శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.