Tokyo 2020: చరిత్ర సృష్టించిన తోబుట్టువులు!

ABN , First Publish Date - 2021-07-26T00:10:55+05:30 IST

ఒలింపిక్స్‌లో జపాన్‌కు చెందిన అన్నాచెల్లెలు సరికొత్త రికార్డు సృష్టించారు. జుడోలో వీరిద్దరూ ఒకేరోజు

Tokyo 2020: చరిత్ర సృష్టించిన తోబుట్టువులు!

టోక్యో: ఒలింపిక్స్‌లో జపాన్‌కు చెందిన అన్నాచెల్లెలు సరికొత్త రికార్డు సృష్టించారు. జుడోలో వీరిద్దరూ ఒకేరోజు బంగారు పతకాలు సాధించి ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 21 ఏళ్ల ఉటా అబే మహిళల 52 కేజీల కేటగిరీలో బంగారు పతకం సాధించింది. అంతకు కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు హిఫుమి అబే 66 కేజీల పురుషుల ఫైనల్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తోబుట్టువులు ఒకే రోజు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 


ఫ్రాన్స్‌కు చెందిన అమండిన్ బుచర్డ్‌తో జరిగిన పోరులో ఉటా విజయం సాధించగా,  ఆమె సోదరుడు 23 ఏళ్లు హిఫుమి అబే జార్జియాకు చెందిన వాజా మార్గ్వెలాష్విలితో జరిగిన పోరులో విజయం సాధించి పసిడిని పట్టేశాడు.  

Updated Date - 2021-07-26T00:10:55+05:30 IST