ఒకే ఇంట్లో 20 కొండచిలువలు.. చూసి షాకైన అధికారులు

ABN , First Publish Date - 2020-10-13T09:39:21+05:30 IST

అక్రమంగా కొండచిలువలను పెంచుకుంటున్న వ్యక్తిని ఊటా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒకే ఇంట్లో 20 కొండచిలువలు.. చూసి షాకైన అధికారులు

ఊటా: అక్రమంగా కొండచిలువలను పెంచుకుంటున్న వ్యక్తిని ఊటా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊటా రాష్ట్రానికి చెందిన మార్టీ లిన్ బోన్(64) అనే వ్యక్తి ఇటీవల ఓ అండర్‌కవర్ పోలీస్ అధికారికి బర్మీస్ కొండచిలువను అమ్మాడు. దీంతో అతడిపై అనుమానంతో పోలీసులు మార్టీ లిన్‌ ఇంటికి వెళ్లారు. ఇంటి లోపలకు వెళ్లిన తాము ఒక్కసారిగా షాక్ అయ్యామని అధికారులు తెలిపారు. ఇంటి లోపల ఎటు చూసినా తమకు బర్మీస్ కొంచచిలువలే కనిపించాయని అన్నారు. కొన్ని కొండచిలువలు పది అడుగుల కంటే పొడవుగా ఉన్నట్టు గుర్తించామన్నారు. కొండచిలువలతో పాటు 585 ఎలుకలు, 46 కుందేళ్లు కూడా మార్టీ లిన్ ఇంట్లో ఉన్నట్టు అధికారులు చెప్పారు. మార్టీ లిన్ పెంచుకుంటున్న జంతువులన్నటిని ప్రస్తుతం పరీక్షలకు పంపామని అధికారులు పేర్కొన్నారు. అక్రమంగా ఇతర దేశాలకు చెందిన కొండచిలువలను పెంచుతున్నందుకు గాను మార్టీ లిన్‌పై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-10-13T09:39:21+05:30 IST