Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి : యూటీఎఫ్‌

వీరవాసరం, నవంబరు 28 : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణపై ప్రతి కార్యకర్త ఉద్యమించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.గోపిమూర్తి పిలుపునిచ్చారు.  వీరవాసరం యూటీఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం వీరవాసరం శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. గౌరవాధ్యక్షుడిగా డి.పుల్లారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కె.నాగమునేశ్వరరావు, ముద్రగళ్ళ శ్రీనివాసరావు, ట్రెజరర్‌గా ఎం.దుర్గారావు, సహాఅధ్యక్షుడు, అధ్యక్షురాలిగా బి.అచ్చియ్య , జి.శ్రీలక్ష్మీ,  ఎన్నికైయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి సీహెచ్‌.పట్టాభిరామయ్య, వ్యవహరించారు. ఉపాధ్యాయులుగా కుమార్‌బాబ్జిని సత్కరించారు. కార్యక్రమం లో రామానుజరావు, పంపన సాయిబాబు,వీరవల్లి భాస్కరరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement