Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలి

తలకొండపల్లి/కేశంపేట/షాబాద్‌: ఉపాధి హామీ పనులను పేదలు వినియోగించుకోవాలని ఎంపీడీవో రాఘవులు అన్నారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా మండలంలోని ఖానాపూర్‌ గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద 2022 జనవరి నుంచి గ్రామంలో చేపట్టే పనులను గ్రామసభలో చర్చించారు. గ్రామంలో నర్సరీ, పాఠశాలలు, రోడ్లు, అంతర్గత మురుగుకాల్వలు, పారిశుధ్య కార్యక్రమాలు, గ్రామ గ్రామ పంచాయతీ రికార్డులను ఎంపీడీవో రాఘవులు పరిశీలించారు. అభివృద్ది పనులకు వేగవంతం చేయాలని సర్పంచ్‌, కార్యదర్శి లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో , పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కేశంపేట మండలంలోని కేశంపేట, చౌలపల్లి, తొమ్మిదిరేకుల, అల్వాల, పోమాల్‌పల్లి, కోనాయపల్లిలో జల్‌శక్తి అభియాన్‌లో భాగంగా ఉపాధి హామీ సాంకేతిక సలహాదారు అజీజ్‌ గ్రామసభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నీటి వనరుల సంరక్షణ పనులను గుర్తించాలన్నారు. వచ్చే వర్షాకాలంలో వర్షపు నీరు ఎక్కడ పడుతుందో అక్కడే నీటిని భూమిలో ఇంకేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు వెంకట్‌రెడ్డి, వీరేష్‌, సావిత్రి, కృష్ణయ్య, మల్లేష్‌, సాంకేతిక సహాయకులు నీలకంఠబాబు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, పోమాల్‌పల్లి ఉపసర్పంచ్‌ అనుమగళ్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ పరిధి  ముద్దెంగూడలో మంగళవారం గ్రామపంచాయితీ కార్యాలయంలో జలశక్తి అభియాన్‌లో భాగంగా వార్డుసభ్యులతో కలిసి గ్రామసభను నిర్వహించారు. ముద్దెంగూడ సర్పంచ్‌ కుర్వ జయమ్మ, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయభూమిలో వాలుకట్టలు  ఫాంపాండ్‌, ఇంకుడు గుంతలు నిర్మించుకొని నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి, పంచాయితీ కార్యదర్శి, వార్డుసభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement