Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

సుభాష్‌నగర్‌, నవంబరు 30: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 12 పడకలతో ఏర్పాటు చేసిన ఐసీయూ గదిని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హైదరాబాద్‌కు చెందిన లారస్‌ ల్యాబ్స్‌ వారు 12 ఐసీయూ పడకల కోసం 30 లక్షలు, నిర్మాణ్‌ స్వచ్చంద సంస్థ ఇతర సామగ్రి అందించిందన్నారు. కొవిడ్‌కు ముందు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో చిన్న చూపు ఉండేదన్నారు. కొవిడ్‌ బారిన పడిన చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో  చేరి కోలుకున్నారని, దాంతో ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. కొవిడ్‌ పేషంట్లకు డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది అందించిన సేవలు వెల కట్టలేనివని అన్నారు. ఐసీయూ పడకలతో పాటు 25 ఆక్సిజన్‌ సిలిండర్లు, 2 వెంటిలేటర్లు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, ఆర్‌ఎంవో డాక్టర్‌ చంద్రశేఖర్‌, లారస్‌ ల్యాబ్స్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు సీహెచ్‌ సీతారామయ్య, ఏజీఎం పవన్‌కుమార్‌, నిర్మాణ్‌ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు గోపి ఉడారు, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement
Advertisement