Abn logo
Nov 22 2020 @ 16:46PM

హైదరబాదీలు వరదల్లో ఉంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నారు: ఉత్తమ్

Kaakateeya

హైదరాబాద్: నగరంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫాంహౌజ్‌లో పడుకున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌‌కు కనీసం వరద బాధితుల్ని పరామర్శించే తీరిక లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ ప్రజలుతగిన బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వరద సాయంపై మాట్లాడుతూ వరద సాయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని విమర్శించారు. అసమర్థత, అవినీతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరోపేరని అన్నారు. ఇక బీజేపీ గురించి మాట్లాడుతూ బీజేపీ నేతలు అర్థరాత్రి కాంగ్రెస్‌ నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలో చేరాలని ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని ఉత్తమ్ అన్నారు.

Advertisement
Advertisement