Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఆర్ఎస్ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం: ఉత్తమ్

హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారితకు కాంగ్రెస్ పాలనలో పెద్దపీఠ వేశామన్నారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలిచ్చామన్నారు. ఇప్పటి వరకు వడ్డీలేని రుణాల కోసం సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వాలేదని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల కోసం మాత్రం రూ.50 కోట్లు విడుదల చేశారని మండిపడ్డారు. వడ్డీ కట్టాలని మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. స్వయం సహాయక సంఘాల ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి మాటతప్పారని ఆరోపించారు. వెంటనే రూ. 1,252 కోట్ల అభయ హస్తం ప్రీమియం డబ్బులు చెల్లించాలని, మహిళా సంఘాలకు ఇచ్చే ఇన్సూరెన్స్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement