highest consumer: మద్యం తాగడంలో యూపీ ఫస్ట్

ABN , First Publish Date - 2021-08-14T14:18:25+05:30 IST

మద్యం సేవించడంలో దేశంలోనే ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది....

highest consumer: మద్యం తాగడంలో యూపీ ఫస్ట్

న్యూఢిల్లీ : మద్యం సేవించడంలో దేశంలోనే ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆర్థిక పరిశోధనాసంస్థ ఐసీఆర్ఐఈఆర్, లా కన్సల్టింగ్ సంస్థ పీఎల్లార్ ఛాంబర్స్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో మద్యం తాగే వ్యక్తుల విషయంలో దేశంలో యూపీ మొదటిస్థానంలో నిలిచింది. 52.5 బిలియన్ డాలర్ల మద్యం మార్కెట్ ఉన్న దేశంలో పశ్చిమబెంగాల్ మద్యం సేవించడంలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాలిక్ పానీయాల విక్రయం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 1.4కోట్ల మంది మద్యం తాగుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది.


మద్యం రిటైల్ ధరలు బాగా పెరగడం వల్ల ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎక్సైజ్ సుంకాలు పెంచినా మద్యం విక్రయాలు మాత్రం పెరుగుతున్నాయని తేలింది. మద్యం విక్రయాలు భారతదేశంలో ఏటేటా పెరుగుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. చిలీ, అర్జెంటీనా, చైనా దేశాల్లా భారత్ మద్యాన్ని ఎగుమతి చేయలేక పోతోంది. 


Updated Date - 2021-08-14T14:18:25+05:30 IST