Uttar Pradesh: పెరుగుతున్న డెంగ్యూ కేసులు...ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2021-09-15T12:59:55+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది...

Uttar Pradesh: పెరుగుతున్న డెంగ్యూ కేసులు...ఇంటింటి సర్వే

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రయాగ్‌రాజ్ జిల్లాలో తాజాగా 97 డెంగ్యూ కేసులు వెలుగుచూశాయి. డెంగ్యూ రోగులకు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స అందిస్తున్నామని ప్రయాగ్ రాజ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నానక్ సరాన్ చెప్పారు. దోమల వ్యాప్తి వల్ల డెంగ్యూ జ్వరాలు ప్రబలుతుండటంతో వీటి నివారణకు ఫాగింగ్ చేపట్టారు. దీంతోపాటు ఆరోగ్యకార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేపట్టారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా మురుగునీటి నిల్వ లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు డెంగ్యూ జ్వరాల నివారణకు యూపీ అధికారులు చర్యలు చేపట్టారు. యూపీలోని మీరట్, లక్నో ప్రాంతాల్లోనూ డెంగ్యూ, వైరల్ జ్వరాలు ప్రబలాయి. వైరల్ జ్వరాలు, డెంగ్యూ నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ చెప్పారు. 

Updated Date - 2021-09-15T12:59:55+05:30 IST