ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా.. ఎన్నికల బరిలోకి దిగే ఛాన్స్!

ABN , First Publish Date - 2021-09-08T22:04:04+05:30 IST

రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలు అని చెప్పినప్పటికీ వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆమె రాజీనామా చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమె ఆగ్రా నుంచి పోటీ చేయవచ్చని

ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా.. ఎన్నికల బరిలోకి దిగే ఛాన్స్!

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంనాథ్ కోవింగ్‌కు పంపించినట్లు ఉత్తరాఖండ్ రాజ్ భవన్ అధికారులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే తాను గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు రాష్ట్రపతికి పంపిన లేఖలో బేబీ రాణి పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య రెండేళ్లు పూర్తి చేసుకున్నారు.


రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలు అని చెప్పినప్పటికీ వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆమె రాజీనామా చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమె ఆగ్రా నుంచి పోటీ చేయవచ్చని అంటున్నారు. ఆమె 1955 నుంచి 2000 మధ్య ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా పని చేశారు. అందుకే అక్కడి నుంచే ఆమె పోటీ ఉంటుందని కూడా కచ్చితంగా చెబుతున్నారు.

Updated Date - 2021-09-08T22:04:04+05:30 IST