Abn logo
Jan 14 2021 @ 10:56AM

కుంభమేళాలో భద్రతకు ఎన్‌ఎస్‌జీ కమాండోలు : ఉత్తరాఖండ్ పోలీసులు

డెహ్రాడూన్ : కుంభమేళాకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రకటించారు. దేశ వ్యతిరేక శక్తుల నుంచి భక్తులను కాపాడటం కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) కమాండోలను మోహరిస్తామన్నారు. అంతకుముందు ఉత్తరాఖండ్ పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్‌తో ఎన్ఎస్‌జీ (ఐజీ ఆపరేషన్స్) మేజర్ జనరల్ వీఎస్ రనడే సమావేశమయ్యారు. వీరిరువురూ కుంభమేళాలో ఎన్ఎస్‌జీ కమాండోలను మోహరించడంపై చర్చించారు. 


అశోక్ కుమార్ మాట్లాడుతూ, దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కుంభమేళాలో రెండు ఎన్ఎస్‌జీ బృందాలను మోహరిస్తామని చెప్పారు. ఈ ఎన్ఎస్‌జీ బృందాలు ఉత్తరాఖండ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు శిక్షణ ఇస్తాయని తెలిపారు. 


మరోవైపు ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా కుంభమేళా నిర్వహణపై స్పందించింది. హరిద్వార్‌లో జరిగే కుంభమేళాలో భక్తులను నియంత్రించడానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు చేపడుతున్న చర్యలను వివరించాలని, ఇతర ఏర్పాట్లను కూడా తెలియజేయాలని ఆదేశించింది. 


Advertisement
Advertisement
Advertisement