ఇప్పటిదాకా 4000 వాహనాలు వెనక్కి.. కారణం కరోనా!

ABN , First Publish Date - 2021-07-13T08:15:57+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ఉత్తరాఖండ్.. పర్యాటకుల విషయంలో కఠిన నిబంధననలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ..

ఇప్పటిదాకా 4000 వాహనాలు వెనక్కి.. కారణం కరోనా!

డెహ్రాడూన్: కరోనా మహమ్మారి కారణంగా ఉత్తరాఖండ్.. పర్యాటకుల విషయంలో కఠిన నిబంధననలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది టూరిస్టులు కనీసం ఆ రాష్ట్రంలోకి ప్రవేశించలేకపోతున్నారు. గత వారం నుంచి దాదాపు 4వేల వాహనాలకు పైగా రాష్ట్రంలోనికి ప్రవేశించకుండా అక్కడి పోలీసులు వెనక్కి పంపించేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోందో తెలుసుకొవచ్చు. దేశంలోని అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇటీవల టూరిస్టుల రాకను పూర్తిగా నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


అయితే కోవిడ్ మళ్లీ పెరిగుతుందనే ఆలోచనతో ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాల్లో ఎక్కువగా జనం గుమిగూడకుండా చూసేలా పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనేకమంది టూరిస్టులను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. అనేక చోట్ల అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి టూరిస్టులను నిలువరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం ముస్సోరీ, నైనితాల్ ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన దాదాపు 4000 వేల వాహనాలను రాష్ట్రంలోనికి రానివ్వకుండా వెనక్కి పంపించేశారు. 

Updated Date - 2021-07-13T08:15:57+05:30 IST