కొండ ప్రాంతాల్లోని గర్భిణులకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయం!

ABN , First Publish Date - 2020-12-03T16:07:01+05:30 IST

నాలుగేళ్ల క్రితం జూలైలో వర్షం కురుస్తున్న అర్థరాత్రివేళ రాధాదేవి అనే గర్భిణి పిల్లవాడికి జన్మనిస్తూ కన్నుమూసింది.

కొండ ప్రాంతాల్లోని గర్భిణులకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయం!

నైనితాల్: నాలుగేళ్ల క్రితం జూలైలో వర్షం కురుస్తున్న అర్థరాత్రివేళ రాధాదేవి అనే గర్భిణి పిల్లవాడికి జన్మనిస్తూ కన్నుమూసింది. 35 ఏళ్ల రాధాదేవి నైనితాల్‌కు శివారున ఉన్న లవార్డోభా అనే గ్రామంలో ఉండేది. అక్కడికి ప్రాథమిక వైద్య చికిత్సా కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబులెన్స్ సమయానికి చేరుకోకపోవడంతో ఆమెకు అధిక రక్తస్రావం జరిగి, ప్రాణాలు కోల్పోయింది. ఈ నాలుగేళ్లలో అక్కడి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు.


డెలివరీ సమయంలో గర్భిణులకు సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని గుర్తించిన ఉత్తరాఖండ్‌లోని  నైనితాల్ పరిపాలనా యంత్రాంగం దీనికి ఒక పరిష్కారం కనుగొంది. అదే గర్భిణులను డోలీలలో ఆసుపత్రులకు తరలించడం. ఈ సందర్భంగా నైనితాల్ డీఎం సివాన్ బన్సల్ మాట్లాడుతూ తాము పర్వత ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉంటున్న గర్భిణులకు డోలీ సదుపాయాన్ని కల్పించనున్నామన్నారు. డెలివరీ సమయంలో వారిని సమీపంలోని హెల్త్ సెంటర్‌లకు తరలించనున్నామన్నారు. ఇందుకోసం ఒక డోలీ ట్రిప్పుకు రెండు వేల రూపాయలు ఛార్జీ చేయనున్నమని తెలిపారు. దీనిలో లేబర్ ఖర్చులు కూడా ఉంటాయన్నారు. ఒక మెడికల్ అధికారి సారధ్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

Updated Date - 2020-12-03T16:07:01+05:30 IST