అయోధ్యలో భూమిపూజ తరువాత రెండింతలైన స్థిరాస్తి ధరలు

ABN , First Publish Date - 2020-09-21T16:10:34+05:30 IST

కరోనా వ్యాప్తి కారణంగా ఏర్పడిన ఆర్థిక మందగమనంతో దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయ్యింది. అయితే దీనికి భిన్నంగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన అనంతరం అక్కడి భూముల ధరలు రెండింతలయ్యాయి.

అయోధ్యలో భూమిపూజ తరువాత రెండింతలైన స్థిరాస్తి ధరలు

అయోధ్య: కరోనా వ్యాప్తి కారణంగా ఏర్పడిన ఆర్థిక మందగమనంతో దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయ్యింది. అయితే దీనికి భిన్నంగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన అనంతరం అక్కడి భూముల ధరలు రెండింతలయ్యాయి. యూపీలోని అయోధ్యలో గడచిన ఒక్క నెలలోనే స్థిరాస్థి ధరలు రెండింతలయ్యాయి. ఆగస్టులో ఇక్కడ రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగింది. 



అయితే అంతకు మందే రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం భూములు, ఇళ్ల ధరలు 30 నుంచి 40 శాతం వరకూ పెరిగాయి. కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నగరాన్ని మరింత అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించడంతోపాటు త్రీస్టార్ హోటళ్లు, పలు నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు సీఎం  ప్రకటించారు. దీని అనంతరం అయోధ్యలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పలువురు రియాల్టర్లు ఇక్కడి భూములను కొనుగోలు చేసి, గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2020-09-21T16:10:34+05:30 IST