‘విశ్వంభర కావ్యంతో సినారెకు విశ్వఖ్యాతి’

ABN , First Publish Date - 2021-07-31T06:24:31+05:30 IST

విశ్వంభర కావ్యంతో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి

‘విశ్వంభర కావ్యంతో సినారెకు విశ్వఖ్యాతి’
సినారె సాహితీ పురస్కారగ్రహీతలతో జస్టిస్‌ చంద్రయ్య

చిక్కడపల్లి, జూలై 30(ఆంధ్రజ్యోతి): విశ్వంభర కావ్యంతో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి విశ్వఖ్యాతినందుకున్నారని మానవ హక్కుల కమిషన చైర్మన జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. మహాకవి సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, సీల్‌వెల్‌ కార్పొరేషన, శృతిలయ ఆర్ట్స్‌ అకాడమి ఆధ్వర్యాన త్యాగరాయగానసభలో పదిగంటల నిర్విరామ సినీ సంగీత విభావరి, సినారె సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా సినీ గేయరచయిత వడ్డేపల్లి కృష్ణ, రచయిత కె. కృష్ణయ్య, ఎం.శివకుమార్‌లను సినారె సాహితీపురస్కారాలతో సత్కరించారు. సభకు పాత్రికేయులు మహ్మద్‌ రఫీ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌.వేణుగోపాలాచారి, గుదిబండి వెంకటరెడ్డి, గాయని ఆమని, కుసుమ భోగరాజు, దామోదర్‌, భారతి, రామచంద్రరావు పాల్గొన్నారు. సినారె రచించిన చిత్ర గీతాలను గాయని ఆమని బృందం ఆలపించి సినారెకు నివాళులర్పించారు. 

Updated Date - 2021-07-31T06:24:31+05:30 IST