వాము పులుసు

ABN , First Publish Date - 2020-09-24T19:47:52+05:30 IST

వాము - 50 గ్రా., వెల్లుల్లి - 1 గడ్డ, ఎండుమిర్చి - 4, ఉల్లిపాయ - 1, జీలకర్ర, ధనియాలు - టీ స్పూను

వాము పులుసు

కావలసిన పదార్థాలు: వాము - 50 గ్రా., వెల్లుల్లి - 1 గడ్డ, ఎండుమిర్చి - 4, ఉల్లిపాయ - 1, జీలకర్ర, ధనియాలు - టీ స్పూను చొప్పున, బెల్లం - కొద్దిగా, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, తాలింపు దినుసులు - సరిపడా., చింతపండు - నిమ్మకాయంత.


తయారుచేసే విధానం: కడాయిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, వాము, జీలకర్ర, ధనియాలు దోరగా వేగించాలి. తర్వాత మిక్సీలో పొడి చేసి అందులలోనే ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకలు, ఉప్పు, పసుపు వేసి ముద్దగా గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు కడాయిలో మిగతా నూనె వేసి తాలింపుతో పాటు వాము మిశ్రమం వేగించి చింతపండు రసం, నీరు పోసి మరిగించాలి. దించేముందు బెల్లం కలపాలి. 


Updated Date - 2020-09-24T19:47:52+05:30 IST