నేడు నూజివీడు డివిజన్‌లో టీకా ఉత్సవ్‌

ABN , First Publish Date - 2021-04-14T06:04:24+05:30 IST

నూజివీడు డివిజన్‌లో 15,381 మందికి కోవిడ్‌ వాక్సిన్‌ను అందించేందుకు కార్యచరణ ప్రణాళికను రూపొందించి నట్లు నూజి వీడు సబ్‌కలెక్టర్‌ ప్రతిష్ఠా మంగైన్‌ తెలిపారు.

నేడు నూజివీడు డివిజన్‌లో టీకా ఉత్సవ్‌

సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ఠా మంగైన్‌

నూజివీడు, ఏప్రిల్‌ 13 : నూజివీడు డివిజన్‌లో 15,381 మందికి కోవిడ్‌ వాక్సిన్‌ను అందించేందుకు కార్యచరణ ప్రణాళికను రూపొందించి నట్లు నూజి వీడు సబ్‌కలెక్టర్‌ ప్రతిష్ఠా మంగైన్‌ తెలిపారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విస్రృతంగా వ్యాపిస్తున్న క్రమంలో 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్‌ను అందిస్తామన్నారు. బుధవారం నుంచి 25 గ్రామ సచివాలయాల్లో, పట్టణ ప్రాంతంలో నాలుగుప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను అందించడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకునే వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ మాస్క్‌లు దరిస్తూ, స్వీయరక్షణ పాటిస్తూశానిటైజర్లు వాడాలని సూచించారు.  ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఎ.కొండూరు, విస్సన్నపేట, తిరు వూరు మండలాల్లోని పీహెచ్‌సీలకు, గంపలగూడెం మండలానికి డోసులు పంపిణీ చేశామన్నారు.

Updated Date - 2021-04-14T06:04:24+05:30 IST