వేటకు సెలవు!

ABN , First Publish Date - 2021-04-13T04:45:01+05:30 IST

తున్నాయి. వేట సామగ్రి ఇళ్లకు చేర్చుతున్నారు. భద్రపరిచే పనుల్లో మత్స్యకారులు బిజీగా ఉన్నారు. రెండు నెలల పాటు వేట నిషేధమే ఇందుకు కారణం. గురువారం నుంచి జూన్‌ 14 వరకూ సముద్రంలో చేపల వేట నిషేధం. ఇందుకు సంబంధించి మత్స్యశాఖ నిషేధాజ్ఞలు జారీచేసింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. దీంతో వారు రెండు నెలల

వేటకు సెలవు!
మరబోటును తీరానికి చేర్చుతున్న మత్స్యకారులు



వేటకు సెలవు!

15 నుంచి జూన్‌ 14 వరకూ వేట నిషేధం

తీరానికి చేరుతున్న బోట్లు, వలలు

మత్స్యకార భరోసా అందించేందుకు ఏర్పాట్లు

19న గ్రామాల వారీగా గణన

(భోగాపురం)

 బోట్లు, వలలు తీరానికి చేరుతున్నాయి. వేట సామగ్రి ఇళ్లకు చేర్చుతున్నారు. భద్రపరిచే పనుల్లో మత్స్యకారులు బిజీగా ఉన్నారు. రెండు నెలల పాటు వేట నిషేధమే ఇందుకు కారణం. గురువారం నుంచి జూన్‌ 14 వరకూ సముద్రంలో చేపల వేట నిషేధం. ఇందుకు సంబంధించి మత్స్యశాఖ నిషేధాజ్ఞలు జారీచేసింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. దీంతో వారు రెండు నెలల పాటు తీరానికే పరిమితం కానున్నారు. ఏటా సముద్రంలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధించడం ఆనవాయితీగా వస్తోంది. చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో తల్లి, పిల్ల చేపల సంరక్షణకుగాను ఏటా ఈ సమయంలో నిషేధం విధిస్తుంటారు. ఉల్లంఘించి వేటకు దిగితే చర్యలు తీసుకోనున్నారు. వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ప్రభుత్వం భృతి అందించనుంది, జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో పదుల సంఖ్యలో తీర గ్రామాలు ఉన్నాయి. వేలాది మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటపై ఉపాధి పొందుతున్నారు. ముక్కాం, చేపలకంచేరు, కొండ్రాజుపాలెం, చింతపల్లి, పతివాడ, తిప్పలవలస, కోనాడ, కొల్లాయివలస తదితర గ్రామాల్లో 3,500 కుటుంబాలు ప్రత్యక్షంగా, 1,500 కుటుంబాలు పరోక్షంగా వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. పురుషులు చేపలవేటకు వెళ్తారు. వారు తెచ్చే చేపలను మహిళలు విక్రయిస్తారు. కొందరు వ్యాపారులు నేరుగా చేపలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ రెండు మండలాల్లో సుమారు 620 మరబోట్లు, 357 సాధారణ బోట్లు ఉన్నాయి. మరో 250 వరకూ రిజిస్ర్టేషన్‌ కానీ బోట్లు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పు న మత్స్యకార భరోసా పథకం కింద భృతిని అందించనున్నారు. కేవలం రిజిస్ట్రేషన్‌ అయిన వారికి మాత్రమే వర్తింపజేయనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 19న బోట్లను గుర్తించనున్నారు. కానీ చాలా మంది వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో భృతి అందని దుస్థితి. దీంతో వారందరిలో ఆందోళన నెలకొంది. అందరికీ వర్తింపజేయాలని కోరుతున్నారు. 


 సంప్రదాయ పడవలకు మినహాయింపు

 సంప్రదాయ పడవలకు మాత్రం నిషేధం వర్తించదు. ఎనిమిది కిలోమీటర్ల లోపల సముద్రంలో వేట చేయవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. వేట నిషేధ సమయం సమీపిస్తుండడంతో తీరంలోకి బోట్లు, పడవలు, వలలు చేర్చే పనిలో మత్స్యకారులు బిజీగా ఉన్నారు. వేకువజాము నుంచే మత్స్యకారులతో సందడిగా కనిపించే తీరం రెండు నెలల పాటు బోసిపోనుంది. తమకు వేట తప్ప వేరే ప్రత్యామ్నాయ ఉపాధి లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ రెండు నెలల పాటు ఉపాధి హామీ పనులు కల్పించినా కొంతవరకూ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. జిల్లా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. 


వేట నిషేధం అమలు

ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకూ సముద్రంలో చేపలవేట నిషేధం. మత్స్య సంపద ఉత్పత్తి సమయం కావడంతో ఏటా రెండు నెలల పాటు నిషేధం ఉంటుంది. ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు భృతి అందిస్తాం. అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తాం. ఇందుకుగాను ఈ నెల 19న బోట్ల గణన చేయనున్నాం. గ్రామాల్లో గణన కోసం వచ్చే సిబ్బందికి మత్స్యకారులు సహకరించాలి. వివరాలు అందించాలి. 

-ఎన్‌.నిర్మలకుమారి, మత్స్యశాఖ ఉప సంచాలకులు, విజయనగరం






Updated Date - 2021-04-13T04:45:01+05:30 IST