టీచర్లందరికీ వ్యాక్సిన్‌ వేయండి

ABN , First Publish Date - 2021-05-11T09:34:40+05:30 IST

కొవిడ్‌-19 ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ వెంటనే వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్‌ చేసింది

టీచర్లందరికీ వ్యాక్సిన్‌ వేయండి

ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య


అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ వెంటనే వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్‌ చేసింది. సోమవారం ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ రాసినట్లు ఫ్యాప్టో చైర్మన్‌ జీవీ నారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్‌ నరహరి ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో 200 మంది పైబడి ఉపాధ్యాయులు మరణించారన్నారు. వారిలో 122 మంది ఉపాధ్యాయుల జాబితాను ఫ్యాప్టో విద్యాశాఖకు సమర్పించిందన్నారు. ఇప్పటికీ అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స  పొందుతున్నారని చెప్పారు. ఉపాధ్యాయులను కొవిడ్‌ వారియర్స్‌గా గుర్తించకపోవడమే ఇంత ప్రాణ నష్టానికి కారణమన్నారు. ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాక్సిన్‌ వేయటానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో డిమాండ్‌ చేసింది. 


ప్రభుత్వ ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పించాలి

అధ్యాపకులు, పోలీసులు, వైద్య, సచివాలయ సిబ్బంది, తదితరులు మధ్యాహ్నం కర్ఫ్యూ కారణంగా తమ ఇళ్లకు చేరడానికి ఇబ్బందులు పడుతున్నారని, వారికి రవాణా సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-11T09:34:40+05:30 IST