ఖమ్మం ‌జిల్లాకు ఒక రోజు ఆలస్యంగా కొవ్యాగ్జిన్‌

ABN , First Publish Date - 2021-04-17T06:00:18+05:30 IST

ఖమ్మం ‌జిల్లాకు ఒక రోజు ఆలస్యంగా కొవ్యాగ్జిన్‌

ఖమ్మం ‌జిల్లాకు ఒక రోజు ఆలస్యంగా కొవ్యాగ్జిన్‌
ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్

బయటపడిన సమన్వయలోపం

అందుబాటులో లేని కోవిషీల్డ్‌ రెండో డోస్‌

ఖమ్మం సంక్షేమవిభాగం, ఏప్రిల్‌ 16: భద్రాద్రి జిల్లాలోని మారుమూల గ్రామంలో కూడా గురువారం కరోనా నివారణ కొవ్యాగ్జిన్‌ టీకా అందుబాటులోకి వచ్చింది. అదేరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారి తాను కొవ్యాగ్జిన్‌ తీసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క డోసు అందుబాటు లోకి రాలేదు. దీంతో ఆయన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. విష యం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా మారుమూల జిల్లాలకు కొవ్యా గ్జిన్‌ అందుబాటులోకి వచ్చిన మరుసటి రోజు కాని ఖమ్మం జిల్లా కు చేరలేదు. శుక్రవారం నుంచి ఖమ్మం జిల్లాలో కొవ్యాగ్జిన్‌ అందు బాటులోకి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 28 ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు 10,700 డోసులు, ప్రైవేట్‌లోని ఏడు ఆసుపత్రులకు ఒక్కో హాస్పటల్‌కు 300 డోసుల చొప్పున కొవ్యాగ్జిన్‌ పంపిణీ చేశారు. 

బయటపడిన సమన్వయలోపం

జిల్లా టీకాల అధి కారులకు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల సమన్వయలోపంతో వ్యాక్సినేషన్‌కు వచ్చే వారికి ఇక్కట్లతో పాటు కరోనా ప్రభావం తప్పటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కరోనా వ్యాక్సినేషన్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపుతున్నారు. కానీ ఏ రోజు ఏ విభాగం, లేదా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ కేటాయించే విషయం జిల్లా ఆసుపత్రి అధికారులకు తెలియటం లేదు. శుక్రవారం సాధారణ ప్రజలకు ఆసుపత్రి అధికారులు వ్యాక్సి నేషన్‌కు అనుమతించారు. అదే సమయంలో డీఎంహెచ్‌వో మాకు అనుమతిచ్చారని బ్యాంకు ఉద్యోగులు వచ్చారు. దీంతో ఎన్‌ఆర్‌సీ వ్యాక్సినేషన్‌ సెంటర్‌, ఏఎన్‌ఎం శిక్షణా కేంద్రం, ఆయుష్‌ విభాగంలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వ్యాక్సినే షన్‌కు వచ్చిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

అందుబాటులో లేని కొవిషీల్డ్‌ రెండో డోస్‌

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభంనుంచి జిల్లాలో ప్రతిరోజు కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ ఇచ్చారు. అయితే శుక్రవారం కొవిషీల్డ్‌ రెండోడోసు వచ్చిన వారికి జిల్లాలో ఒక్క డోసు కూడా అందుబాటులో లేదు. కొవిషీల్డ్‌ రెండో డోసు ఏ రోజు ఎంతమందికి ఇవ్వాలనే కార్యాచరణ వైద్యఆరోగ్య శాఖ అధికారుల వద్ద ఉంటుంది. కానీ జిల్లా ఆసుపత్రి నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వరకు కొవిషీల్డ్‌ రెండో డోస్‌ కోసం వచ్చిన వారికి నిరాశే మిగిలింది. అన్ని కేంద్రాల్లో కొవ్యాగ్జిన్‌ మాత్రమే అందుబాటులో ఉంచటంతో కొవి షీల్డ్‌ రెండో డోసు లబ్ధిదారులు ఆవేదనతో వెనుదిరి గారు. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద రెండు రకాల వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరు తున్నారు.

Updated Date - 2021-04-17T06:00:18+05:30 IST