ఒక్కరోజే 1,36,010 మందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-06-21T05:23:56+05:30 IST

ఒక్కరోజే 1,36,010 మందికి వ్యాక్సిన్‌

ఒక్కరోజే 1,36,010 మందికి వ్యాక్సిన్‌
వన్‌టౌన్‌లోని ఓ స్కూల్‌లో వ్యాక్సినేషన్‌ కోసం బారులు తీరిన ప్రజలు

జిల్లాలో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు విశేష స్పందన

విజయవాడ, ఆంధ్రజ్యోతి/విద్యాధరపురం : కరోనా కట్టడికి జిల్లాలో ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. లక్షమందికి టీకా వేయాలనే లక్ష్యం కాగా, 1,36,010 మందికి వేశారు. జిల్లాలో 260 కేంద్రాల ద్వారా 45 ఏళ్లు నిండిన వారికి మొదటి, రెండో డోసు వ్యాక్సిన్‌ అందించడంతో పాటు ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు ఈ మెగా డ్రైవ్‌ ద్వారా టీకాలు వేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. విజయవాడ నగరంలోనే 124 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ అందించారు. ఈ ప్రక్రియను జేసీ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ రాజ్యలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ గీత ప్రసాదిని, నోడల్‌ అధికారులు ఈ కేంద్రాలను పర్యవేక్షించారు.

441 కేసులు.. ముగ్గురు మృతి

కరోనా మహమ్మారి ఆదివారం మరో ముగ్గురిని బలి తీసుకుంది. గడిచిన 24 గంటల్లో 441 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారికంగా 1,063కు చేరింది. పాజిటివ్‌ కేసులు 98,484కు పెరిగాయి. వీరిలో ఇప్పటివరకు 92,384 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 5,037 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


Updated Date - 2021-06-21T05:23:56+05:30 IST