కొనసాగిన వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-20T06:40:07+05:30 IST

ల్లాలో కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగు తోంది. ఎంపికచేసిన 22 కేంద్రాల్లో మొదటి

కొనసాగిన వ్యాక్సినేషన్‌
టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

మూడో రోజు 22 కేంద్రాల్లో 486 మందికి టీకా 

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 19 : జిల్లాలో కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగు తోంది. ఎంపికచేసిన 22 కేంద్రాల్లో మొదటి విడతలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే 24వేల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ వేయాలని లక్ష్యంగా నిర్దే శించగా మంగళవారం 486 మందికి వ్యాక్సినేషన్‌ వేశారు. ఆ విధంగా గత నాలుగు రోజుల్లో 3,445 మంది టీకా వేయించుకున్నారు. 


 మండలానికి ఒక వ్యాక్సినేషన్‌ కేంద్రం

వ్యాక్సినేషన్‌ కోసం మండలానికి ఒక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్లడించారు. స్థానిక మినీస్టేడియంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. తొలిరోజు ఇద్దరు, ముగ్గురికి చిన్నపాటి సమస్యలు రాగా,  వెంటనే పరిష్కరించామన్నారు.  ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే మండలానికి ఒక  కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ మండలపరిధిలో ఎం పికచేసిన వారికి వ్యాక్సిన్‌ వేస్తామని కలెక్టర్‌  చెప్పారు. 


Updated Date - 2021-01-20T06:40:07+05:30 IST