2200 మందికి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-09-18T05:26:50+05:30 IST

కరోన మెగా వ్యా క్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం అన్ని సచివాలయాల్లో 2200 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు తొట్టిగారిపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికా రి చంద్రహా్‌సరెడ్డి తెలిపా రు.

2200 మందికి వ్యాక్సినేషన్‌
ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ చంద్రహా్‌సరెడ్డి

బద్వేల్‌ రూరల్‌, సెప్టెంబ రు 17: కరోన మెగా వ్యా క్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం అన్ని సచివాలయాల్లో 2200 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు తొట్టిగారిపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికా రి చంద్రహా్‌సరెడ్డి తెలిపా రు. మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ లో భాగంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కరోన వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోన వ్యాక్సిన్‌ పట్ల అవగాహన కల్పించి 2200 మందికి వ్యాక్సిన్‌ వేశారన్నారు.  కార్యక్రమంలో వైద్య సిబ్బంది,  ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు. 

పోరుమామిళ్ల, సెప్టెంబరు 17: మండలంలోని 17 గ్రామ సచివాలయాల్లో 1975 మందికి టీకాలు వేసినట్లు టేకూరుపేట ప్రాధమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-09-18T05:26:50+05:30 IST