Abn logo
Sep 22 2021 @ 23:04PM

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాక్సినేషన్‌ తప్పనిసరి

మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

సిర్పూర్‌(యూ), సెప్టెంబరు 22: జిల్లాప్రజలు ఆరో గ్యంగా ఉండాలంటే వ్యాక్సినేషన్‌ తప్పనిసరిగా వేసు కోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మహగాం రాయిసెంటర్‌ ఆధ్వ ర్యంలో ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ ప్రాణాలను పోగొట్టడానికి కాదు ప్రాణాలను నిలబెట్టడాని కన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. రానున్న నెల, రెండు నెలల్లో థర్డ్‌వేవ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈలోగా అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నట్ల యితే కరోనాను తట్టుకునే శక్తి వస్తుం దన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌యాదవ్‌రావు,ఎంపీటీసీ యశ్వంత్‌ రావు, సర్పంచ్‌లు వీణబాయి, భూపతి, పద్మరాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

- అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

తిర్యాణి: ప్రతిఒక్కరూ కొవిడ్‌వ్యాక్సిన్‌ వేసుకోవాలని అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. బుధవారం మం డల కేంద్రంలోని గిన్నెధరి రైతువేదిక భవనంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన ఆమట్లాడారు. స్పెష ల్‌డ్రైవ్‌ కింద జిల్లాలో ఐదురోజుల పాటు పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో వ్యాక్సినేషన్‌ చేపడతామనిప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీఆర్డీవో రవికృష్ణ, ఎంపీపీశ్రీదేవి, జడ్పీటీసీచంద్రశేఖర్‌, సర్పంచ్‌ అర్చన పాల్గొన్నారు.