మానవ సంక్షేమం కోసమే వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-17T04:37:50+05:30 IST

మానవ సంక్షేమం కోసమే కొవిడ్‌-19 వ్యాక్సి నేషన్‌ టీకాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకవచ్చినట్లు జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత అన్నారు.

మానవ సంక్షేమం కోసమే వ్యాక్సినేషన్‌
శాంతి జయసుధ సన్మానిస్తున్న కలెక్టర్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌, ఎమ్మెల్యే

జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత ఫజగిత్యాల, కోరుట్లలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ప్రారంభం

జగిత్యాల టౌన్‌, జనవరి 16 : మానవ సంక్షేమం కోసమే కొవిడ్‌-19 వ్యాక్సి నేషన్‌ టీకాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకవచ్చినట్లు జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో శనివారం వ్యాక్సినేషన్‌ టీకా కేంద్రాన్ని చైర్‌పర్సన్‌ వసంత, ఎమ్మెల్యే సంజ య్‌ కుమార్‌, కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ ప్రారంభించారు. తొలి టీ కాను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సు శాంతి జయసు ధకు ఇచ్చారు. దావ వసంత మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం టీకాను అందుబాటులోకి తీసుకవచ్చిందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా తీసు కోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ జిల్లాలో జగి త్యాల, కోరుట్లలో వ్యాక్సినేషన్‌ టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి తొలి రోజు 60 మందికి టీకా వేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సుదక్షిణాదేవి, ఆర్‌ఎంవో రామకృష్ణ, ఉప వైధ్యాధికారి జైపాల్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు సమియోద్దిన్‌, శ్రీనివాస్‌, కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌, తహసీల్దార్‌ వెంకటేష్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

ప్రభుత్వ నియమావళి ప్రకారం వాక్సినేషన్‌ నిర్వహించాలి

కోరుట్ల : ప్రభుత్వ నియమావళి ప్రకారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రజలకు అం దించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, జిల్లా అదనపు కలెక్ట ర్‌ రాజేశం, మున్సిపల్‌ చైర్మెన్‌ అన్నం లావణ్య కలిసి ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్‌ను వైద్యుడు సుధీర్‌ తీసుకున్నాడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్‌ అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్‌, ఎంపీపీ తోట నారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుడ్ల లక్ష్మి, తహసీల్దార్‌ సత్యానారా యణలతో పాటు వైద్య సిబ్బంది, మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు. ఇది లా ఉండగా వ్యాక్సిన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ రవి పరిశీలించారు. మొదటి రోజు 15 మంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు. 

Updated Date - 2021-01-17T04:37:50+05:30 IST