వ్యాక్సినేషన్‌ గర్భిణులకు సురక్షితం

ABN , First Publish Date - 2021-07-30T04:57:02+05:30 IST

గర్భిణులు వ్యాక్సినేష న్‌ చేయించుకుంటే తల్లీ బిడ్డలకు సురక్షి తమని మున్సిపల్‌ చైర్మన్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.

వ్యాక్సినేషన్‌ గర్భిణులకు సురక్షితం
పోరుమామిళ్లలో వ్యాక్సినేషన్‌పై మానవహారం నిర్వహిస్తున్న అధికారులు

బద్వేలు చైర్మన్‌ రాజగోపాల్‌ రెడ్డి పిలుపు

ర్యాలీ చేపట్టిన అధికారులు

బద్వేలు, జూలై29: గర్భిణులు వ్యాక్సినేష న్‌ చేయించుకుంటే తల్లీ బిడ్డలకు సురక్షి తమని  మున్సిపల్‌ చైర్మన్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కరోనా కట్టడిపై జిల్లా వ్యాప్తంగా ర్యాలీ, అవగాహన సదస్సులు చేపట్టారు. ఇం దులో భాగంగా బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లో కార్యక్ర మాలు చేపట్టారు. బద్వేలు కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిబంధన లు పాటించాలన్నారు.

అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వార్డు పరిధిలోని గర్భిణులకు టీకాపై అవగాహన కల్పించి టీకా వేయించాలని సూచించారు. బాలుర ఉన్నత పాఠశాల నుంచి నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, అంగన్వాడీ సీడీపీఓ సునంద, ఎంపీడీఓ రామకృష్ణ, డాక్టర్‌ చంద్రహాసరెడ్డి, అర్బన్‌ ఎస్‌ఐ వెంకటరమణ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

పోరుమామిళ్లల్లో మానవహారం

పోరుమామిళ్ల, జూలై 29: వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల తల్లి, బిడ్డకు రక్ష ణ అని తహసీల్దారు మహ్మద్‌ అలీఖాన్‌, ఎంపీడీఓ డాక్టర్‌ కిశోర్‌ప్రసాద్‌, ఆరో గ్య వైద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైద్య వి ధాన పరిషత్‌ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసిన వారు మాట్లాడుతూ గర్భిణులు, ఐదేళ్ల పిల్లల తల్లులు  వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నా రు. ఐసీడీఎస్‌ సీడీపీఓ శ్రీదేవి, పోరుమామిళ్ల ఈఓ రామ్మోహన్‌రెడ్డి, కేశవరెడ్డి, అంగన్వాడీ సూపర్‌వైజరు లక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- గోపవరం, జూలై 29: వ్యాక్సినేషన్‌ విషయంలో గర్భిణులు ఎలాంటి సందేహాలు పడవద్దని, వైద్యాధికారి డాక్టర్‌ వాసుదేవరెడ్డి, ఎంపీడీఓ మోహన్‌ పేర్కొన్నారు. గోపవరంలో అవగాహన ర్యాలీ అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణులు వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల గర్భస్థశిశువుకు కూడా మేలు జరుగుతుందన్నారు.కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజరు లక్ష్మీ, సీహెచ్‌ఓ గౌస్‌, పంచాయతీ కార్యదర్శులు విజయకుమా ర్‌, శ్రీనివాసులరెడ్డి, మోసే, వెంకటసుబ్బయ్య, అంగన్వాడీలు, ఆశాలు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- కలసపాడు, జూలై 29: అపోహలు వీడి గర్భిణులు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మూడురోడ్ల కూడలి నుంచి కలసపాడు వీధుల్లో గర్భిణులు ప్రభుత్వ వైద్య కా ర్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.  అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

- ఖాజీపేట, జూలై 29: వ్యాక్సిన్‌ కరోనా నుంచి రక్షణ కవచమని మండ ల అభివృద్ధి అధికారి మైథిలి పేర్కొన్నా రు. ఖాజీపేట బస్టాండు కూడలి వరకు గురువారం టీకాపై అంగన్వాడీ వైద్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించిన ఆమె మాట్లాడారు. వైద్యాధికారి సెల్వియాసా ల్మన్‌, ఆరోగ్య విస్తర ణాధికారి రాఘవ య్య, సీహెచ్‌ఓ పార్వతి, ఆశానోడల్‌ అధికారి షంషాద్‌బేగం, వైద్య, అంగన్వా డీ సూపర్‌వైజర్లు  పాల్గొన్నారు.

- బి.కోడూరు, జూలై 29: గర్భిణులకు వ్యాక్సిన్‌పై వైద్యాధికారి వర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ ఉమామహేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాల యం నుంచి బి.కోడూరు కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- కాశినాయన జూలై 29: గర్భిణులు టీకా వేయించుకుని తల్లీ బిడ్డ సురక్షితం గా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తహసీల్దారు రవిశంకర్‌, ఎంపీడీఓ ము జఫర్‌ రహీం పేర్కొన్నారు. నర్సాపురం లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అవహన ర్యా లీ, మానవహారం నిర్వహించారు. సెక్రటరీ సీతారామిరెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రత్యూష, పబ్లిక్‌ హెల్త్‌నర్సు శారద సిబ్బంది పాల్గొన్నారు. 

- చాపాడు, జూలై 29: గర్భిణులు టీకాలు వేయించుకోవాలని ఐసీడీఎస్‌ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ప్రొ ద్దుటూరు రూరల్‌ ఐసీడీఎస్‌ సీడీపీఓ నిర్మలాదేవి, తహసీల్దారు జ్యోతి రత్న కుమారి, ఎంపీడీఓ శ్రీధర్‌నాయుడు, డాక్టర్‌ జ్యోత్న్సారెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వై జర్లు కళావతి, లక్ష్మిదేవి ర్యాలీ నిర్వహిం చారు. జాతీయ రహదారిపై మానవహా రం ఏర్పాటు చేశారు. అంగన్వాడీ టీచ ర్లు, గర్భిణులు, సిబ్బంది పాల్గొన్నారు.

- సింహాద్రిపురం, జూలై 29: గర్భిణు లు, 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేష న్‌ వేయించుకోవాలని ప్రజల్లో   అవగా హన కల్పిస్తూ సింహాద్రిపురంలో ఎంపీ డీఓ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వ హించారు. సర్కిల్‌లో మానవహారం ఏ ర్పాటు చేసి వ్యాక్సినేషన్‌తో కలిగే ఉప యోగాలను వివరించారు. డాక్టర్‌ రమే ష్‌, ఎంపీహెచ్‌ఓలు జయప్రకాష్‌, సుకు మార్‌, ఏఎన్‌ఎంలు, ఆశాలు, అంగన్‌వా డీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 

- పులివెందుల, జూలై 29: అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాల ని ర్యాలీలో నినదించారు. పూలంగళ్ల నుంచి ఆర్టీసీ కూడలి వరకు వైద్య ఆరో గ్య, అంగన్వాడీలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిప ల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, డాక్టర్‌ ప్ర దీప్‌కుమార్‌, సీడీపీఓ శ్రీలత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- బ్రహ్మంగారిమఠం, జూలై 29:  ఎంపీడీఓ కార్యాలయం నుంచి గురువా రం ఎంపీడీఓ వెంగమునిరెడ్డి ఆధ్వర్యం లో గర్భిణులకు టీకాపై అవగాహన ర్యా లీ చేపట్టారు. ఈఓపీఆర్‌డీ శ్రీనివాసు లు, పంచాయతీ సెక్రటరీలు, సచివాల యం సిబ్బంది, అంగన్వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- వేముల, జూలై 29: టీకాను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని వైద్యాధికారి ఉమాదేవి పేర్కొన్నారు. గురువారం వేములలో వ్యాక్సిన్‌పై అపోహలు వీడా లని ఆమె సూచించారు. 

- మైదుకూరు, జూలై29: వ్యాక్సిన్‌పై అపోహలు వీడి గర్భిణులు, తల్లులు వేయించుకోవాలని ఏసీ సీడీపీఓ లూక్‌ పేర్కొన్నారు. అర్బన్‌ హెల్త్‌ గైనకాలజిస్ట్‌ శ్రీలత,అంగన్‌వాడీ కార్యకర్తలతో కలసి  ఆయన ర్యాలీ నిర్వహించారు. 



Updated Date - 2021-07-30T04:57:02+05:30 IST