వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-04-12T06:04:00+05:30 IST

మండల కేంద్రంలోని ముప్పై పడకల ఆసుపత్రిని ఆదివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ రాంబాబు వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సం

వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేయాలి
నర్సాపూర్‌(జి)లో తహసీల్దార్‌ కిరణ్మయిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు

నర్సాపూర్‌(జి), ఏప్రిల్‌ 11: మండల కేంద్రంలోని ముప్పై పడకల ఆసుపత్రిని ఆదివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ రాంబాబు వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుండ గా డ్యూటీ డాక్టర్‌ అందుబాటులో ఉండాలన్నారు. సోమవారం సాయంత్రం వరకు వంద శాతం వ్యాక్సినేషన్‌ చేయాలని ఆదేశించారు.  

లోకేశ్వరం: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్‌ రాంబాబు వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.  

దిలావర్‌పూర్‌: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్‌ రాంబాబు సందర్శించారు. ఆసుపత్రిలో జరుగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. 

భైంసా: ఉదృతరూపం దాల్చుతున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడాలంటే  ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా వైద్యాధికారి డా.ధన్‌రాజ్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన భైంసాలో కొనసాగుతున్న కొవిడ్‌- 19 టీకాల కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులం దరూ ఎలాంటి భయాందోళనలు చెందకుండా టీకా వేయించుకోవాలన్నారు.

కుభీర్‌: 45 ఏళ్లు ఉన్న ప్రతీ ఒక్కరికి టీకాలు వేయాలని వైద్యాధికారి ధన్‌రాజ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన డిప్యూటీ డీఎంహెచ్‌వో అసిష్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

Updated Date - 2021-04-12T06:04:00+05:30 IST