నెలాఖరుకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-01-19T04:52:03+05:30 IST

ఈనెలాఖరు వరకు వ్యాక్సి నేషన్‌ను పూర్తి చేయాలని

నెలాఖరుకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌ : ఈనెలాఖరు వరకు వ్యాక్సి నేషన్‌ను పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రి యపై మంగళవారం మంత్రి తన ఛాంబర్‌లో అధికారులతో సమీ క్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ. జిల్లాలో ఇప్పటి వరకు 27,21,906 మందికి మొదటిడోసు, 19,74,621 మందికి రెండో డోసు వేసినట్లు తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వారిలో లక్షా 77వేలు లక్ష్యం కాగా, 84వేల మందికి వ్యాక్సినేషన్‌ వేసినట్లు తెలి పారు. బూస్టర్‌ డోస్‌ ఇప్పటివరకు 4 వేల మందికి వేసినట్లు స్పష్టం చేశారు. లక్ష్యం మేరకు అందరూ టీకా వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


 ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తాం

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో వానాకాలం పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు మంత్రి సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 41,151 టన్నుల ధాన్యం 38 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా మూడు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లా నగరానికి అతి సమీపంలో ఉన్నందున యాసంగిలో వరికి బదులు కూరగాయల సాగుపై దృష్టిపెట్టాలని సూచించారు. రైతుబంధుకు సంబంధించి జిల్లాలో 2,91,167 మంది రైతులకు రూ.317కోట్లకుపై చిలుకు నిధులు వారి ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో పండే పంటను కొనమని ఇప్పటికే అఽధికారికంగా తెలపటంతో తెలంగాణలో కూడా ప్రభుత్వం ఎలాంటి కొనుగోలు జరుపబోమన్నారు. 


భావితరాల ప్రయోజనాల పరిరక్షణకు కేసీఆర్‌ కృషి

భావితరాల ప్రయోజనాల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ దార్శనికతతో ముందుకు సాగుతున్నారని మంత్రి సబితారెడ్డి  తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అంకితభావంతో అందించేందుకు చర్యలు చేపడుతున్నా మన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మనఊరు - మనబడి పథకాన్ని అమలు చేసేందుకు రూ.7,289కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పైలెట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు పాఠశాలల్లో పనులను చేపట్టినట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని శివరాంపల్లి, మహబూబియా(బాలికల) ఉన్నత, ప్రాథమిక పాఠశాలల నిర్మాణాల కోసం రూ.3.57కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే 40శాతం పూర్తయ్యాయన్నారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, డీఎం సివిల్‌ సప్లై అధికారి శ్యామారాణి, వైధ్యాధికారులు, టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, పార్థసారథి తదితరులు ఉన్నారు. 



Updated Date - 2022-01-19T04:52:03+05:30 IST