Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

జన్నారం, డిసెంబరు 7: ప్రతీ గ్రామంలో వందశా తం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని డీఎంహెచ్‌ వో కొమురం బాలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని, వైద్య సిబ్బందికి సహకరించాలని సూచించారు. డీఈఎంవో బుక్కా వెంకటేశ్వర్‌,  మం డల ఆరోగ్య అధికారి సునీత, వైద్య సిబ్బంది ఉన్నారు. 

 కోటపల్లి: కరోనా నియంత్రణకు ప్రతీ ఒక్కరు టీకా వేయించుకోవాలని డీఆర్‌డీవో శేషాద్రి అన్నారు.  రాంపూర్‌లో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. మొదటి విడత వ్యాక్సిన్‌ పూర్తయిన వారు రెండో విడత వేసుకోవాలన్నారు. మాస్కు ధరించాలని, నిర్ల క్ష్యం చేయవద్దని సూచించారు. నర్సరీ పనులు నాణ్య తగా ఉండాలని పంచాయతీ అధికారులను కోరారు.  ఎంపీడీవో భాస్కర్‌, సర్పంచు భారతి పాల్గొన్నారు. 

నెన్నెల: వంద శాతం వ్యాక్సినేషన్‌ కోసం కృషి చేయాలని ఆర్డీవో శ్యామలాదేవి అన్నారు. అర్హులైన వారిని గుర్తించి టీకా ఇవ్వాలని సూచించారు. కోనం పేట, లంబాడితండాలలో పర్యటించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. గ్రామంలోని జనాభా, టీకా కు అర్హులైనవారు, టీకా తీసుకున్న వారి వివరాలను  అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాలు వ్యాక్సినేషన్‌ లో వెనుకబడి ఉన్నాయని, సిబ్బంది లక్ష్యాన్ని సాధిం చకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.  తహసీల్దార్‌ సంపతి శ్రీనివాస్‌ ఉన్నారు.

 

Advertisement
Advertisement