సజావుగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-05-06T05:37:46+05:30 IST

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందునాయక్‌ సూచించారు.

సజావుగా వ్యాక్సినేషన్‌
జిల్లా కేంద్రంలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందునాయక్‌

    గద్వాలక్రైం, మే 5 : వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందునాయక్‌ సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చిన ప్రతీ వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ ప్రకారం టీకా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. వచ్చిన వారికి ముందుగా సెక్యూరిటీ గార్డు టోకెన్‌ ఇవ్వాలని సూచించారు. వారందరూ భౌతిక దూరం పాటించేలా పోలీసు కానిస్టేబుళ్లు చూడాలని సూచించారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు 30 నిమిషాలు అబ్జర్వేషన్‌లో ఉండాలని చెప్పారు. ఆయన వెంట జిల్లా హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మధుసూదన్‌రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అబ్రహం, హన్మంతు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-05-06T05:37:46+05:30 IST