వ్యాక్సినేషన్‌లో ఆ రాష్ట్రం నంబర్ వన్... ప్రధాని మోదీ ప్రసంశలు!

ABN , First Publish Date - 2021-08-28T14:25:17+05:30 IST

కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం.

వ్యాక్సినేషన్‌లో ఆ రాష్ట్రం నంబర్ వన్... ప్రధాని మోదీ ప్రసంశలు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం జనవరి 16 నుంచి ప్రారంభమయ్యింది. 


ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్‌లో 28 లక్షల జనాభాకు టీకాలు వేశారు. తరువాతి స్థానంలో కర్నాటక్ ఉంది. ఇక్కడ ఇప్పటివరకూ 10 లక్షల మందికి టీకాలు వేశారు. కోవిన్ పోర్టల్‌ను అనుసరించి... దేశవ్యాప్తంగా మొత్తం 62 కోట్ల, 17 లక్షల ఆరు వేల 882 మందికి టీకాలు వేశారు. 48 కోట్ల 8 లక్షల 78 వేల 410 మందికి మొదటి డోసు టీకాలు వేయగా, 14 కోట్ల 8 లక్షల 28 వేల 472 మందికి రెండవ డోసు టీకా వేశారు. ఇప్పటివరకూ వ్యాక్సినేషన్ విషయంలో మొదటి స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

Updated Date - 2021-08-28T14:25:17+05:30 IST