16 నుంచి వ్యాక్సినేషన్ షురూ : సీఎం కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-01-14T18:25:21+05:30 IST

ఢిల్లీలో ఈ నెల 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ఒక ప్రదేశంలో

16 నుంచి వ్యాక్సినేషన్ షురూ : సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఈ నెల 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ఒక ప్రదేశంలో రోజుకు సుమారు 100 మందికి టీకాలు వేస్తారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యాక్సినేషన్ వారానికి నాలుగు రోజులు మాత్రమే వుంటుందని, సోమ, మంగళ, గురు, శని వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని ఆయన ప్రకటించారు. మొదట్లో 81 సెంటర్లో దీనిని ప్రారంభిస్తామని, రానూ రానూ దీనిని 175 కేంద్రాలకు పునురద్ధరిస్తామని, ఆ తర్వాత ఢిల్లీ వ్యాప్తంగా 1000 కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి 2,74,000 డోసులను అందుకున్నామని, ప్రతి వ్యక్తికీ రెండు డోసులు ఇస్తామని కేజ్రీవాల్ తెలిపారు.  

Updated Date - 2021-01-14T18:25:21+05:30 IST