కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-17T06:29:55+05:30 IST

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌-19ను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వ్యాక్సిన్‌
ఉట్నూర్‌ సీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌కు హాజరైన వైద్య సిబ్బంది

ఉట్నూర్‌లో ప్రారంభించిన ఎమ్మెల్యే రేఖానాయక్‌ 

ఉట్నూర్‌, జనవరి 16: ప్రపంచాన్ని వణికించిన  కొవిడ్‌-19ను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌  అన్నారు. శనివారం ఉట్నూర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఐటీడీఏ పీవో భవే్‌షమిశ్రాతో కలిసి ప్రారంభించిన సంద ర్భంగా ఆమె మాట్లాడారు. మొదటి టీకాను వైద్య ఆరోగ్యశాఖకు చెందిన  ఉట్నూర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌తో పాటు  తోటి వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, వాచ్‌మెన్‌లు, మొత్తం 30మందిని ఎంపిక చేసి టీకాను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరుకూడా ఎలాంటి ఆం దోళనకు గురికావొద్దని, ప్రపంచంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కొవిడ్‌-19 ఎదురుకోవడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నందున ఏవైనా చిన్న లోటుపాట్లు ఉంటే పట్టించుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో భవే్‌షమిశ్రా, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కుడిమెత మనోహర్‌ తదితరులు మాట్లాడారు. కాగా, ఈ కార్యక్రమాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ డేవిడ్‌ పరిశీలించారు. ఇందులో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, జడ్పీటీసీ రాథోడ్‌ చారులత, సింగిల్‌ విండో చైర్మన్‌ ఎస్పీ రెడ్డి, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీ, కోఆప్షన్‌ సభ్యుడు రషీద్‌, డా.మాలతిరెడ్డి, కోవ అనురాధ, వైద్య సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-01-17T06:29:55+05:30 IST