వ్యాక్సిన్‌ సెంటర్లను పెంచాలి

ABN , First Publish Date - 2021-06-21T06:18:17+05:30 IST

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వ్యాక్సిన్‌ సెంటర్ల ను పెంచి 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ కలెక్టర్‌ను కోరారు.

వ్యాక్సిన్‌ సెంటర్లను పెంచాలి
మాట్లాడుతున్న సోమారపు సత్యనారాయణ

- 18సంవత్సరాలు దాటిన వారు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ

గోదావరిఖని, జూన్‌ 20: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వ్యాక్సిన్‌ సెంటర్ల ను పెంచి 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ కలెక్టర్‌ను కోరారు. ఆదివారం గోదావరిఖని డిగ్రీ కళాశా లలో ఏర్పాటుచేసిన వ్యాక్సిన్‌ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సెకండ్‌ఫ్లోర్‌లో వ్యాక్సిన్‌ సెంటర్‌ ఏర్పాటుచేయడం వల్ల వయో వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానిని గ్రౌండ్‌ఫ్లోర్‌కు మార్చాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏడు అర్బన్‌ సెంటర్లలో వ్యాక్సిన్‌ కేంద్రాల్లో ఇంజెక్షన్లను నిలిపివేయకుండా కొనసాగించా లని కోరారు. రోజుకు 5వేల మందికి వ్యాక్సిన్‌ వేయాలని, అదే విధంగా జవహర్‌నగర్‌ స్టేడియం, జీఎం ఆఫీస్‌ గ్రౌండ్‌, జూనియర్‌ కళాశాల మైదానంలో వ్యాక్సిన్‌ సెం టర్‌ను ఏర్పాటు చేసి మూడవ దశ కరోనాను ఎదుర్కొవడానికి రెండవ డోస్‌ను కూడా ప్రజలకు త్వరగా అందించే విధంగా చూడాలని కోరారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేం ద్రాన్ని సందర్శించిన వారిలో బీజేపీ నగర అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్‌యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ కోదాటి ప్రవీణ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌ ఉన్నారు.

Updated Date - 2021-06-21T06:18:17+05:30 IST