ఇక మేకలు, గొర్రెలకు టీకాలు.!

ABN , First Publish Date - 2022-01-24T04:04:27+05:30 IST

ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మనుషులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పెద్దఎత్తున సాగుతున్న క్రమంలోనే ఇక మేకలు, గొర్రెలకు కూడా పీపీఆర్‌ పేరిట ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టేందుకు పశుసంవర్ధక శాఖ కార్యాచరణ రూపొందించింది.

ఇక మేకలు, గొర్రెలకు టీకాలు.!
మేత కోసం వెళ్తున్న మేకలు, గొర్రెలు

నేటి నుంచి జిల్లావ్యాప్తంగా పీపీఆర్‌ వ్యాక్సినేషన్‌ 

32 బృందాల ఏర్పాటు 

ఫిబ్రవరి 7వ తేదీ వరకు ప్రక్రియ 

జిల్లాలో 4,84,120 లక్షల మేకలు, గొర్రెల లక్ష్యం 

నిర్మల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మనుషులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పెద్దఎత్తున సాగుతున్న క్రమంలోనే ఇక మేకలు, గొర్రెలకు కూడా పీపీఆర్‌ పేరిట ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టేందుకు పశుసంవర్ధక శాఖ కార్యాచరణ రూపొందించింది. 

ప్రతి ఏటా వేసవి ముగిసే వరకు..

ప్రతిఏటా జనవరి నుంచి వేసవి ముగిసే వరకు మేకలు, గొర్రెలకు ముసర వ్యాధి (పారుడు రోగం) సంభవిస్తుంటోంది. ఈ వ్యాధి తీవ్రంగా సోకిన మేకలు, గొర్రెలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ముసర వ్యాధికి సంబంధించిన వైరస్‌ను నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపడుతున్నారు. సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టేందుకు పశుసంవర్ధక శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ముసర వ్యాధితో ముప్పు..

ప్రతిఏటా ముసర వ్యాధి కారణంగా గ్రామీ ణ ప్రాంతాల్లో మేకలు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. స్థానికంగా పారుడు రోగంగా పిలుచుకునే ఈ ముసర వ్యాధి తీవ్రమైతే వాటి ప్రాణాలకే ముప్పని చెబుతున్నారు. ఈ వ్యాధిని నివారించేందుకు మందులు లేవని, టీకా ఒక్కటే శరణ్యమం టూ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో దాదాపు 5లక్షల వరకు మేకలు, గొర్రె లు ఉన్నట్లు అధికారుల లెక్క లు చెబుతున్నాయి. వీటి సం ఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా జనవ రి నుంచి వాతావరణ పరిస్థితుల కారణంగా ముసర వ్యాఽధి మేకలు, గొర్రెలకు వ్యాపిస్తోంది. 

జిల్లావ్యాప్తంగా 19 మండలాలకు.. 

జిల్లావ్యాప్తంగా 19 మండలాలకు మొత్తం 32 బృందాలను వ్యాక్సినేషన్‌ కోసం ఎంపిక చేసింది. ఈ బృందాల్లో పశు వైద్యాధికా రి, ఫారా స్టాఫ్‌ ఉండేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. జిల్లాలో మొత్తం 4,84,120లక్షల మేకలు, గొర్రెలున్నట్లు పశు సంవర్ధక శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2,53,635 గొర్రెలు, 65,917 మేకలు ఉ న్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటి కోసం జిల్లాకు 3.19లక్షలకు పైగా టీ కాలను తెప్పించారు. ఫిబ్రవరిలో ముసర వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో సంబంధిత అధికారులు 15 రోజుల పాటు నిరాటకంగా వ్యాక్సినేషన్‌ను చేపట్టబోతున్నారు. ముసర వ్యాధి సోకితే గొర్రెలు, మేకలు తీవ్ర విరేచనాలతో పాటు జ్వరానికి గురవుతాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని, ఆహారం కూడా తీసుకోలేవని అధికారులు పేర్కొంటున్నారు. ఒక గొర్రెల మందలోని ఒక గొర్రెకు ముసర వ్యాధి సోకితే ఒకటి రెండు రోజుల్లోనే ఆ వ్యాధి మందలోని మిగతా గొర్రెలకు సైతం వ్యాపిస్తుందంటున్నారు. వారం రోజుల్లోనే తీవ్రత పెరిగి ప్రాణ ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు.

జిల్లాకు చేరిన టీకాలు..

జిల్లాలోని 19 మండలాలకు సరిపోయే విధంగా పీపీఆర్‌ టీకాలు చే రుకున్నాయి. మొత్తం 3,19,652 టీకా లు జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాల యంలో అందుబాటులో ఉంచారు. ఈ టీకా కార్యక్రమం కోసం జిల్లావ్యాప్తంగా 32 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు తమ పరిధిలోని పశు వైద్యశాలలు, సబ్‌ సెంటర్‌లతో పాటు అన్ని చో ట్ల మేకలు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నాయి. మొదట మేకలు, గొర్రెల పెంపకందారుల వద్దకు వెళ్లి వారు పెంచుతున్న మందలను వైద్య బృందాలు పరిశీలించనున్నాయి. లక్షణాలు వెలుగుచూసిన మేకలు, గొర్రెలను మంద నుంచి తప్పించి వేరే చో టుకు మార్చనున్నారు. ఆ తరువాత లక్షణాలున్న వాటికే కాకుండా మిగతా వాటికి కూడా వేరు వేరుగా టీకాలు ఇవ్వనున్నారు. 

నేటి నుంచి జిల్లావ్యాప్తంగా..

సోమవారం నుంచి జిల్లాలోని 19 మండలాల్లో 32 బృందాలు మేకలు, గొర్రెల కోసం పీపీఆర్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టబోతున్నాయి. ఫి బ్రవరి 7వ తేదీ వరకు 15 రోజుల పాటు ఊరూరా పశువైద్య బృం దాలు పర్యటించి వ్యాక్సినేషన్‌ను చేపట్టనున్నాయి. ఇటీవల పం పిణీ చేసిన మేకలు, గొర్రెల ల బ్ధిదారులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. స్థానిక ప్ర జాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకా రం కూడా తీసు కోనున్నారు. పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ 15 రోజుల పాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Updated Date - 2022-01-24T04:04:27+05:30 IST