11 నుంచి ఆఫీసుల్లోనూ టీకాలు

ABN , First Publish Date - 2021-04-08T07:04:33+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ప్రదేశాల్లోనూ(వర్క్‌ ప్లేస్‌) కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు పచ్చజెండా ఊపింది. టీకా తీసుకునేందుకు

11 నుంచి ఆఫీసుల్లోనూ టీకాలు

ప్రభుత్వ, ప్రైవేటు పని ప్రదేశాలన్నింటికీ అవకాశం.. కేంద్రం మార్గదర్శకాలు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ప్రదేశాల్లోనూ(వర్క్‌ ప్లేస్‌) కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు పచ్చజెండా ఊపింది. టీకా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న, అర్హులైన కనీసం 100 మంది సిబ్బంది ఉండే పని ప్రదేశాల ప్రాంగణంలోనూ ఏప్రిల్‌ 11 నుంచి వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఏర్పాటు చేయొచ్చని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ బుధవారం లేఖ రాశారు. ఎంపిక చేసే పని ప్రదేశాన్ని సమీపంలోని ఓ టీకా కేంద్రంతో అనుసంధానం చేస్తామన్నారు. పని ప్రదేశాల ఎంపిక కోసం ప్రభుత్వ, ప్రైవేటురంగ కంపెనీలతో చర్చలు ప్రారంభించాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ శిబిరాల నిర్వహణకు కేంద్రం తరఫున అందించే సహాయ సహకారాలకు సంబంధించిన పలు వివరాలతో మార్గదర్శకాలను జారీచేశారు. 

  •  పనిప్రదేశంలో టీకా తీసుకోవాలని భావించే అర్హులైన సిబ్బంది అందరూ తమ వివరాలను కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. 
  •  రిజిస్టర్‌ చేసుకున్న సిబ్బంది ఒక్కరికే టీకా వేస్తా రు. అతడు/ఆమె కుటుంబ సభ్యులకు ఇవ్వరు. 
  •  జిల్లా మెజిస్ట్రేట్‌ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌, మునిసిపల్‌ కమిషనర్‌ సారథ్యంలోని అర్బన్‌ టాస్క్‌ఫోర్స్‌లు వర్క్‌ప్లే్‌సల ఎంపికను చేపడతాయి. 
  •  పనిప్రదేశాల్లో టీకా శిబిరాల నిర్వహణను, మౌలిక వసతుల లభ్యతను ఒక నోడల్‌ అధికారి పర్యవేక్షిస్తూ, టాస్క్‌ఫోర్స్‌లకు నివేదిక అందిస్తారు. 
  •  ఎంపిక చేసిన వర్క్‌ప్లే్‌సలు కూడా కొవిన్‌ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 
  •  పనిప్రదేశంలో ఏర్పాటుచేసే టీకా శిబిరం వెయిటిం గ్‌, వ్యాక్సినేషన్‌, అబ్జర్వేషన్‌ గదులు అనే మూడు భాగాలుగా ఉండాలి. టెంట్లు, షామియానాలతో టీకా శిబిరం ఏర్పాటుకు అనుమతించరు. 
  •  పనిప్రదేశాల్లో వైద్య వసతులు ఉంటే, వాటిని కూడా వ్యాక్సినేషన్‌ శిబిరం కోసం వినియోగిస్తారు.
  •  ప్రభుత్వ కార్యాలయాల శిబిరాన్ని సమీపంలోని సర్కారు ఆస్పత్రిలోని వ్యాక్సినేషన్‌ కేంద్రంతో.. ప్రైవే టు పనిప్రదేశాల టీకా శిబిరాన్ని సమీపంలోని ప్రై వేటు ఆస్పత్రిలో టీకా కేంద్రంతో ట్యాగ్‌ చేస్తారు. 
  •  ప్రైవేటు వర్క్‌ప్లే్‌సలలో వ్యాక్సినేషన్‌ కోసం ప్రైవేటు టీకా కేంద్రాలు తమ ఆరోగ్య కార్యకర్తల సేవలను ఉపయోగిస్తాయి. 
  •  వర్క్‌ప్లే్‌సలో వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-04-08T07:04:33+05:30 IST