ప్రశాంతంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-17T05:03:54+05:30 IST

నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎన్‌ఎంసీ కమిషనర్‌ కే దినే్‌షకుమార్‌ పరిశీలించారు.

ప్రశాంతంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభం
టీకాను పరిశీలిస్తున్న కమిషనర్‌ దినే్‌షకుమార్‌

నెల్లూరు (సిటీ), జనవరి 16 : నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎన్‌ఎంసీ కమిషనర్‌ కే దినే్‌షకుమార్‌ పరిశీలించారు. ఎంహెచ్‌వో వెంకరటరమణయ్యతో కలిసి వెంకటేశ్వరపురంలోని జనార్దన్‌రెడ్డికాలనీ వద్ద ఉన్న యూకోనగర్‌ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. తొలుత వ్యాక్సినేషన్‌కు అర్హత పొందిన వారి జాబితాను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. టీకా వేయించుకున్నాక వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో అక్కడ నుంచి కోటమిట్టలోని అర్బన్‌ ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. అక్కడా కొంత సమయం పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైద్యులు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ఏజీతో మర్యాదపూర్వక భేటీ 

ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కమిషనర్‌ దినే్‌షకుమార్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నెల్లూరురూరల్‌ ప్రాంతం కనుపర్తిపాడులోని ఆయన స్వగృహానికి వెళ్లి కొంత సమయం పాటు చర్చించారు. నగరంలోని అభివృద్ధితో పాటు కోర్టుల్లో ఉన్న సమస్యలపైనా చర్చించినట్లు సమాచారం.

సౌత్‌మోపూరులో 80 మందికి గాను 67 మందికి టీకా 

2 గంటలు మొరాయించిన సర్వర్‌ 

నెల్లూరురూరల్‌ : మండలంలోని సౌత్‌మోపూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బందికి టీకాను అందించారు. తొలి టీకాను పీహెచ్‌సీ వైద్యుడు రవీంద్రనాథ్‌రెడ్డికి వేశారు. అనంతరం సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎం, ఆశాలకు ఒక్కొకరిగా టీకాలను వేశారు. తొలి రోజు 80 మందికి 67 మందికి వ్యాక్సిన్‌ వేశారు. మిగిలిన 13 మందికి వివిధ అనారోగ్య సమస్యల వల్ల వేయలేకపోయామనీ, టీకా వేయించుకున్న తర్వాత ఎవరికి ఎలాంటి సమస్య తలెత్తలేదని పీహెచ్‌సీ ప్రధాన వైద్యురాలు ఎస్‌. కవిత తెలిపారు. రెండు విడతలుగా 2 గంటల పాటు కరోనా వెబ్‌సైట్‌ సర్వర్‌ మొరాయించింది. అనంతరం సాఫీగా ఈ ప్రక్రియ సాగింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పీవోడీటీటీ డాక్టర్‌ ఉమామహేశ్వరి పర్యవేక్షించారు. కార్యక్రమంలో తహసీల్దారు వెంకటేశ్వర్లు, ఎంఈవో రహీం, సీపీఐ నాయకుడు పీ దశరధరామయ్య, వైసీపీ నాయకులు రాపూరు చంద్రశేఖర్‌, అన్నం సుబ్బారావు పాల్గొన్నారు.




Updated Date - 2021-01-17T05:03:54+05:30 IST