కరోనా వాక్సిన్‌ పట్ల అభద్రత వదు

ABN , First Publish Date - 2021-03-03T06:44:56+05:30 IST

కరోనావ్యాధి నివారణకు ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించిన వాక్సిన్‌ వేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ కన్సల్‌టెంట్‌ డాక్టర్‌ టి.నీరద తెలిపారు.

కరోనా వాక్సిన్‌ పట్ల అభద్రత వదు
కరోనావాక్సిన్‌ భద్రతను పరిశీలిస్తున్న‌ నీరద

డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ నీరద

తాళ్లూరు, మార్చి 2 : కరోనావ్యాధి నివారణకు ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించిన వాక్సిన్‌ వేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ కన్సల్‌టెంట్‌ డాక్టర్‌ టి.నీరద తెలిపారు. ప్రజలు అభద్రత వీడి అందరూ వాక్సిన్‌ వేయించుకోవాలన్నారు.  తాళ్లూరు వీకే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కరోనా వాక్సిన్‌ తీరును మంగళవారం పరిశీలించారు. వాక్సిన్‌ ఏవిధంగా భద్రపరిచారో పరిశీలించారు. 60 ఏళ్లు నిండిన వారికి, 45 నుండి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ పర్యాయం కరోనా వాక్సిన్‌ తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో  క్షయనివారణ జిల్లా అధికారి డాక్టర్‌ కె.సురే్‌షకుమార్‌, స్థానిక వైద్యాధికారి షేక్‌ ఖాదర్‌ మస్తాన్‌బీ, ఆరోగ్యకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T06:44:56+05:30 IST