వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2022-01-27T02:55:18+05:30 IST

నాయుడుపేటలోని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు, ప్రభుత్వ పాఠశాలల తోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు బుధవారం గ

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు
నాయుడుపేటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఆర్డీవో సరోజిని

నాయుడుపేట, జనవరి 26 : నాయుడుపేటలోని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు, ప్రభుత్వ పాఠశాలల తోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు బుధవారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాయి.ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సరోజిని, కోర్టులో జడ్జి గీతావాణి, మున్సిపల్‌ కార్యాల యంలో చైర్‌పర్సన్‌ కటకం దీపిక,  తహసీల్దారు కార్యాల యంలో తహసీల్దారు శ్రీనివాసులు, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ధనలక్ష్మి, ఎంపీడీవో శివప్రసాద్‌, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ కృష్ణారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు పేర్నాటి వెంకటేశ్వర్లు, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ వెంకటకృ ష్ణారెడ్డి, న్యాయవాదులు పార్థసారధిరెడ్డి, చదలవాడ కుమార్‌, దశయ్య మొదలియార్‌, కిషోర్‌కుమార్‌, పసల చెంగయ్య, రఫీ తదితరులు పాల్గొన్నారు. 


 ఓజిలిలో..


ఓజిలి, జనవరి 26 : మండలంలో బుధవారం రెవెన్యూ, అభివృద్ధి, పోలీసుస్టేషన్‌లలో లాజరస్‌, రమణయ్య, శేఖర్‌బాబులు  జాతీయజెండా ఎగురవేసి వందనం చేశారు. అలాగే మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాఽథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోపాటు ఆసుపత్రులు, సచివాలయాలు, వివిధ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా ఎగురవేశారు.  ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ అరుణమ్మ, వైస్‌ ఎంపీపీ ప్రసాద్‌నాయుడు, జడ్పీటీసీ సభ్యుడు రవీంద్రరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. 


 డీవీ సత్రంలో..


దొరవారిసత్రం, జనవరి 26 :  మండలంలోని తహసీల్దారు కార్యాలయంలో డీటీ సందీప్‌, ఎంపీడీవో కా ర్యాలయంలో సింగయ్య, ఎంఈవో కార్యాలయంలో మాస్తానయ్య, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ తిరుమలరావు, బీసీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌ మాధవయ్య,  కేజీబీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు షబానా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అలాగే అన్ని పాఠశాలల్లో గణతంత్ర వేడుకలను ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లోను  ఉద్యోగులు గణతంత్ర వేడుకలు నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దువ్వూరు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 


 తడలో...


తడ,  జనవరి 26 : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కొలవి రఘు, ఎంపీడీవో శైలేంద్రకుమార్‌, హౌసింగ్‌ ఏఈ సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ వెంకటేష్‌, తహసీల్దారు కార్యాలయం వద్ద తహసీల్దారు రామయ్య, ఆర్‌ఐ తులసీ రామ్‌,  పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి, బీవీపాళెం చెక్‌పోస్టు రవాణాశాఖ కార్యాలయం వద్ద ఎంవీఐ రాంబా బు, తడ, తడకండ్రిగ, కారూరు, పూడి పంచాయతీలలో సర్పంచులు ఆర్ముగం, జయప్రద శశికుమార్‌, నిత్యాసందర్‌ రెడ్డి, పరమశివంరెడ్డి, ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్‌ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి, స్వీట్లు పంచిపెట్టారు. పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, ఆనంద్‌రావు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే శ్రీసిటీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బిజినెస్‌ సెంటర్‌ వద్ద తమిళనాడు మాజీ  ఐజీ సారంగన్‌ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ప్రెసిడెంట్‌ సతీష్‌కామర్స్‌,  వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌కుమార్‌, సెక్యురిటీ హెడ్‌ రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.


9 మందికి అవార్డులు 


సమర్థవంతంగా విధులు నిర్వహించిన 9 మంది అధికా రులకు అవార్డులు దక్కాయి. అవార్డు పొందినవారిలో తహసీల్దారు ఎస్‌. రామయ్య, ఎంపీడీవో వీ. శైలేంద్రకుమార్‌, ప్రత్యేక అధికారి ఎన్‌. సురేష్‌కుమార్‌, హౌసింగ్‌ ఏఈ జేవీ సత్యనారాయణ, ఎస్‌ఐ జేపీ శ్రీనివాసరెడ్డి, ఐకేపీ ఎపీఎం హేమమాలిని, తడ పంచాయతీ కార్యదర్శి పి. రమణయ్యలు ఉన్నారు.  ఈ  సందర్భంగా వారిని పలువురు అభినందించారు. 



సూళ్లూరుపేటలో..


సూళ్లూరుపేట, జనవరి 26 : సూళ్లూరుపేటలోని ప్రభు త్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ, వివిధ కార్యాలయాలల్లోనూ బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు రవికుమార్‌, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ నరేంద్రకుమార్‌ పతాకావిష్కరణ చేశారు. చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి,  బాపూజీ  విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యాలయ సిబ్బంది,  కౌన్సిలర్లు పాల్గొన్నారు. రోటరీక్లబ్‌ ఆధ్వర్యం లో స్థానిక రోటరీహాల్‌ వద్ద అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి పతాకావిష్కరణ చేశారు. రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ వేనాటి విజయలక్ష్మి, క్లబ్‌ కార్యదర్శి వినయ్‌సాగర్‌, జాన్సీ, తదితరు లు పాల్గొన్నారు. బాలికోన్నత పాఠశాలలో వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సీపీఐ కార్యాలయంలో మండల పార్టీ కార్యదర్శి ఓగూరు కృష్ణయ్య పతాకావిష్కరణ చేశారు. నియోజకవర్గ కన్వీనర్‌ సీహెచ్‌ సుధాకర్‌, ఎం. రమణయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో వందశాతం బిల్లింగ్‌ చేసినందుకు సిబ్బం దికి పురస్కారాలు అందజేశారు. అలాగే కార్యాలయ ప్రాం గణంలో  ఎడీ ఖాదర్‌బాషా పతాకావిష్కరణ చేసి పురస్కా రాలు పంపిణీ చేశారు. ఏఈలు,  సిబ్బంది పాల్గొన్నారు. 









Updated Date - 2022-01-27T02:55:18+05:30 IST