‘వాహన మిత్ర’ ద్వారా జిల్లాలో 25,794 మందికి లబ్ధి

ABN , First Publish Date - 2021-06-16T06:16:22+05:30 IST

వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ద్వారా జిల్లాలో 2021-22 సంవత్సరానికి 25,794 మందికి రూ.25.79 కోట్ల లబ్ధి చేకూరనుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.

‘వాహన మిత్ర’ ద్వారా జిల్లాలో 25,794 మందికి లబ్ధి
వాహనమిత్ర చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యేలు

కాకినాడ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ద్వారా జిల్లాలో 2021-22 సంవత్సరానికి 25,794 మందికి రూ.25.79 కోట్ల లబ్ధి చేకూరనుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు పేర్ని నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలతో కలిసి జగన్‌ ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ప్రారంభించారు. కాకినాడ కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీ రాజకుమారి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. టీడీసీ ఎ.మోహన్‌, రవాణా శాఖ అధికారులు ఆర్‌.రాజేంద్రప్రసాద్‌, బి.శ్రీనివాస్‌, ఎం.అప్పారావు, ఆర్‌.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-06-16T06:16:22+05:30 IST