Miss India USA 2021 విన్నర్ వైదేహీ డోంగ్రే

ABN , First Publish Date - 2021-07-20T17:21:17+05:30 IST

మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో మిచిగాన్ యువతి సత్తా చాటారు. 25ఏళ్ల వైదేహి డోంగ్రే.. మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో గెలుపొంది, కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 1997లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో వి

Miss India USA 2021 విన్నర్ వైదేహీ డోంగ్రే

వాషింగ్టన్: మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో మిచిగాన్ యువతి సత్తా చాటారు. 25ఏళ్ల వైదేహి డోంగ్రే.. మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో గెలుపొంది, కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 1997లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన డయానా హేడెన్ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై, జడ్జిగా వ్యవహరించారు. మిస్ ఇండియా యూఎస్ఏ 2021లో వైదేహీ డోంగ్రే విజేతగా నిలిచినట్టు డయానా హేడెన్ ప్రకటించారు. ఈ క్రమంలో స్పందించిన వేదేహి డోంగ్రే.. సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం మరియు అక్షరాస్యత కోసం కృషి చేయనున్నట్టు వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వైదేహీ డోంగ్రే.. ప్రస్తుతం బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జార్జియాకు చెందిన అర్షి లలాని.. ఈ పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. 


Updated Date - 2021-07-20T17:21:17+05:30 IST