May 16 2021 @ 11:38AM

విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న మ‌హేశ్ హీరోయిన్‌..!

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీ లైగ‌ర్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత చేయబోయే సినిమాల్లో ఓ దానిలో కృతిసనన్‌తో జోడీ కట్టబోతున్నారట విజయ్. ‘లైగర్’ తర్వాత ఈ యంగ్ హీరో, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమా కాగానే, డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించే సినిమాలో న‌టించ‌బోతున్నారు. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ రావ‌డంతో సుక్కు ఇప్పుడు.. విజ‌య్ దేవ‌ర‌కొండ స్క్రిప్ట్‌, ఇత‌ర విష‌యాల‌పై ఫోక‌స్ పెట్టారు. లేటెస్ట్‌గా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు, సుకుమార్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చేయ‌బోయే సినిమాలో కృతిస‌న‌న్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. కృతిస‌న‌న్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుకుమార్ డైరెక్ట్ చేసిన 1 నేనొక్క‌డినే సినిమాతోనే. మ‌రి మ‌రోసారి సుక్కు డైరెక్ష‌న్‌లో న‌టించ‌డానికి ఓకే అంటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిటింగ్ త‌ప్ప‌దు.