కేంద్రీయ విద్యాలయాల్లో తమిళానికి తావులేదా? : వైగో ఆగ్రహం

ABN , First Publish Date - 2020-11-16T16:53:35+05:30 IST

కేంద్రీయ విద్యాల యాల్లో తమిళ బోధన తగ్గించడం

కేంద్రీయ విద్యాలయాల్లో తమిళానికి తావులేదా? : వైగో ఆగ్రహం

చెన్నై : కేంద్రీయ విద్యాల యాల్లో తమిళ బోధన తగ్గించడం పట్ల ఎండీఎంకే నేత వైగో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ భాష  నేర్చుకునేందుకు కనీసం 20 మంది విద్యార్థులు ఆసక్తి కనబరిస్తేనే తమిళం బోధించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధన సవరించడం గర్హనీయమన్నారు. ఈ మేరకు ఆదివారం వైగో ఓ ప్రకటన విడుదల చేస్తూ కేంద్రీయ విద్యాలయాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన మాతృభాషను తప్పనిసరిగా బోధిం చాల్సి వుందన్నారు. ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అవసరమైౖతే పదో తరగతి వరకూ విద్యార్థులకు తమిళభాషను బోధించే విధంగా 2013-14 విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ విద్యా నిబంధన 112 అమలులోకి తెచ్చారని వైగో పేర్కొన్నారు.


 ప్రస్తుతం ఆ పాఠశాలల్లో తమిళభాష బోధించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన అమలులోకి తెచ్చిందని, ఆ మేరకు ఓ తరగతిలో 20 మంది విద్యార్థులు తమిళభాషను బోధిం చాలని కోరితేనే వారికి ఆ భాష నేర్పుతారని, అంతే కాకుండా తమిళం నేర్పేందుకు పార్ట్‌ టైమ్‌ టీచర్లను మాత్రమే నియమించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం షరతు విధించిందన్నారు. ఈ కొత్త నిబంధనలన్నీ కేంద్రీయ విద్యాలయాల్లో తమిళభాషకు తావు లేకుండా చేయడానికేనని వైగో విమర్శించారు.

Updated Date - 2020-11-16T16:53:35+05:30 IST