Oct 26 2021 @ 10:46AM

వైష్ణవ్ తేజ్ - 'బొమ్మరిల్లు' భాస్కర్ కాంబోలో గీతా ఆర్ట్స్ కొత్త చిత్రం..?

వైష్ణవ్ తేజ్ - 'బొమ్మరిల్లు' భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ తాజాగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు మూడు సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా దక్కని అక్కినేని అఖిల్‌కి ఫస్ట్ సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థలో నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా భాస్కర్ నెక్స్ట్ మూవీని కూడా గీతా ఆర్ట్స్ సంస్థలోనే చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. 'ఉప్పెన' మూవీతో టాలీవుడ్‌కు పరిచయమై ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్..ఆ తర్వాత వచ్చిన 'కొండపొలం' మూవీతో కూడా హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.