Abn logo
Aug 15 2020 @ 00:46AM

వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా షురూ!

‘ఉప్పెన’తో హీరోగా పరిచయం అవుతున్న పంజా వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రా్‌పలో సాగే చిత్రమిది. శనివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలువుతుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేయడనికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు’’ అని నిర్మాతలు చెప్పారు.  జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement