vaishnav tej: మరో 'ఉప్పెన' లాంటి హిట్ పడాల్సిందే..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌కు మరో 'ఉప్పెన' లాంటి వంద కోట్లు రాబట్టే హిట్ కావాల్సిందేనని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారట. అందుకు కారణం 'కొండపొలం' సినిమానే అని తెలుస్తోంది. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన సినిమా 'ఉప్పెన'. ఈ సినిమా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న డెబ్యూ హీరో రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. కరోనా తర్వాత థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను దాటింది. దాంతో వైష్ణవ్ తేజ్ నటించిన రెండవ సినిమా 'కొండపొలం' మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించింది.

అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా అందరినీ డిసప్పాయింట్ చేసింది. 'ఉప్పెన' తర్వాత వచ్చే సినిమా మరో లెవల్‌లో ఉంటుందనుకున్న అందరికీ షాక్ తగిలింది. దాంతో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. ఇందులో 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత అన్నపూర్ణ బ్యానర్‌లో నాగార్జున నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఈ మూవీ ద్వారా కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట. చూడాలి మరి మెగా అభిమానులు ఆశిస్తున్నట్టు మళ్ళీ వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' వంటి హిట్ సాధిస్తాడా లేదా.  

Advertisement
Advertisement