May 4 2021 @ 11:31AM

నితిన్ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్..?

యూత్‌స్టార్ నితిన్‌కి భీష్మ సినిమాతో డీసెంట్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమలతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన 4వ సినిమా చేయబోతున్నాడని తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కరోనా సమయంలో కూడా డెబ్యూ సినిమా ఉప్పెనతో 100 కోట్ల హీరోగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇక క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే వైష్ణవ్‌తో ఒక సినిమాను పూర్తి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న గిరీషయ్యతో వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలయి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగినట్టు సమాచారం. కాగా వైష్ణవ్ తేజ్ 4వ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ఛలో, భీష్మ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా మారిన వెంకీ కుడుమల దర్శకత్వం వహించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.